NationalNews

చిన్న వ్యాపారులకు ప్రధాని బంపర్ స్కీం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిన్న వ్యాపారాలకు సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. గతంలో ప్రవేశపెట్టిన ముద్రా స్కీం కింద అందించే లోన్ పరిమితిని రూ.10 లక్షల నుండి రూ.20 లక్షలకు పెంచారు. దీనితో చిన్న వ్యాపారులకు బంపర్ ఆఫర్ తగిలినట్లయ్యింది. ప్రస్తుతం ప్రధాని ముద్రాయోజన పథకంలో శిశు, కిషోర్, తరుణ్ అనే కేటగిరీల ద్వారా రుణాలు అందుతున్నాయి. ఇప్పుడు తరుణ్ ప్లస్ అనే కొత్త కేటగిరీ కూడా ప్రారంభం అయ్యింది. తరుణ్ పథకం కింద రూ.5లక్షల నుండి రూ.10 లక్షల వరకూ రుణం ఇస్తారు. దీనిని విజయవంతంగా చెల్లిస్తే తరుణ్ ప్లస్ పథకం కింద రూ.20 లక్షల వరకూ రుణం పొందవచ్చు. చిన్న యూనిట్ల వ్యాపారాలకు క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ కింద ప్రభుత్వ గ్యారెంటీ కూడా లభిస్తుంది.