ఎల్ కె అద్వానీకి ప్రధాని బర్త్ డే విషెస్
బీజేపీ అగ్రనేత ఎల్ కె అద్వానీ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ ట్విట్టర్ లో విషెస్ చెప్పారు. దేశానికి అద్వానీ సేవలకు గాను ఆయనకు భారతరత్న ప్రదానం చేశారని తెలిపారు. దేశాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో అద్వానీ ముఖ్య పాత్ర పోషించారన్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని తాను ప్రార్థిస్తున్నానని మోదీ వెల్లడించారు.