Home Page SliderNational

కాంగ్రెస్ పై ప్రధాని అటాక్..

హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. హర్యానాలోని హిస్సార్ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో ప్రధాని మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మోదీ ఆరోపించారు. చెట్లను నరికేసి పర్యావరణాన్ని నాశనం చేస్తుందని ఫైర్ అయ్యారు. అడవులపై బుల్డోజర్లను నడిపించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం బిజీగా ఉందన్నారు. ప్రకృతిని ధ్వంసం చేస్తూ వన్య ప్రాణులను చంపుతున్నారని ప్రధాని ఆరోపించారు.