Home Page SliderInternational

మోదీ ది బాస్ అన్న ఆస్ట్రేలియా ప్రధాని

ప్రధాని మోదీ ఇవాళ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. కాగా ఈ పర్యటనలో భాగంగా ఆయన సిడ్నీలో నిర్వహించిన  ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా పీఎం అంథోని అల్బనీస్ మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ ఈ వేదికపై నేను చివరిసారిగా సింగర్ బ్రూస్ స్ప్రింగ్‌స్టీన్‌ను చూశానన్నారు. అయితే ఇప్పుడు మోదీకి లభించిన స్వాగతం అప్పుడు ఆయనకు లభించలేదన్నారు. ఎందుకంటే ప్రధాని మోదీ ది బాస్ అని ఆయన అన్నారు. ఓ బాస్‌కి మాత్రమే ఇలాంటి ఘన స్వాగతం లభిస్తుందన్నారు.కాగా అంథోని మాటలు విన్న మోదీ నవ్వుతూ చప్పట్లు కొట్టారు. దీంతో దీనికి సంబంధించిన వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.