హిరోషిమాలోగాంధీజీ విగ్రహాన్నిఆవిష్కరించిన ప్రధాని మోదీ
ప్రధానిమోదీ జీ 7 సదస్సు సందర్భంగా జపాన్‌లోని హిరోషియాలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడ గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. హిరోషిమాలోని మొటొయాసు నదికి సమీపంలో ఈ విగ్రహావిష్కరణ జరిగింది. జపాన్‌లోని హిరోషిమా,నాగసాకిలపై అణు బాంబు విధ్వంసం పేరు వింటేనే ప్రపంచం వణికిపోతుందని, ఇలాంటి ప్రదేశంలో శాంతికి ప్రతిరూపమైన మహాత్ముని విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం లభించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జపాన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. జపాన్ ప్రధానికి గతంలో మోదీ ఇచ్చిన బోధి వృక్షాన్ని కూడా అదే ప్రదేశంలో నాటారని ప్రశంసించారు. తనకు చాలా అనుభూతి కలిగిందన్నారు. పద్మభూషన్ గ్రహీత ఐన రామ్ వాంజీ సుతర్ ఈ విగ్రహాన్ని రూపొందించారు.