అంబులెన్స్‌కు దారిచ్చిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్‌కు వెళుతున్నప్పుడు అంబులెన్స్‌కు మార్గం కల్పించేందుకు కాన్వాయ్‌ను కొద్దిసేపు ఆపారు. గుజరాత్ బీజేపీ మీడియా సెల్ షేర్ చేసిన వీడియోలో ప్రధాని కాన్వాయ్ పక్కకు ఆగినట్లు స్పష్టంగా కన్పించింది. రెండు SUVలు అంబులెన్స్‌ను దాటేందుకు అహ్మదాబాద్-గాంధీనగర్ రోడ్డు పక్కన మోదీ కన్వాయ్ కొద్ది సేపు ఆగింది. ప్రధాని మోదీ అహ్మదాబాద్‌లో ర్యాలీ తర్వాత గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్‌కు వెళ్లే మార్గంలో అంబులెన్స్‌కు దారి ఇవ్వడానికి ప్రధాని మోదీ కాన్వాయ్‌ని నిలిపివేశారని గుజరాత్ బీజేపీ పేర్కొంది. గుజరాత్ పర్యటన రెండో రోజున, ప్రధాని మోడీ హై-స్పీడ్ గాంధీనగర్-ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును జెండా ఊపారు. అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ యొక్క మొదటి దశను కూడా ప్రారంభించారు.
