కేసీఆర్ కు షాక్ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ
నిజామాబాద్ బహిరంగ సభలో ప్రధాని మోడీ కేసీఆర్‌పై రాజకీయంగా సంచలన ఆరోపణలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ తనను ఢిల్లీలో కలిశారని మోడీ చెప్పారు. ఆ సమయంలో తెలంగాణలో తమతో కలిసి పని చేయాలని కోరారన్నారు. కేటీఆర్‌కు తాను ఆశీర్వచనం అందించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. గతంలో ఎప్పుడు చెప్పని ఓ రహస్యం చెబుతానంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ రాజకీయంగా పెను బాంబు పేల్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఆలోచనలో పూర్తిగా మార్పు వచ్చిందన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలతో మొత్తం సిట్యువేషన్ తనకు అర్థమైందని ప్రధాని మోడీ వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంతో ప్రేమ ఒలకపోశారని అంతటి ప్రేమను, గతంలో ఎన్నడూ చూడలేదని చెప్పారు. గతంలో కేసీఆర్ ఎప్పుడూ అలా కన్పించలేదన్నారు. దేశం నా నేతృత్వంలో దూసుకుపోతుందని కేసీఆర్ ఓ రేంజ్ లో భజన చేశారని మోడీ వివరించారు. తెలంగాణ పగ్గాలు కేటీఆర్ కు అప్పగిస్తానని ఆయనను ఆశీర్వదించాలని కోరారని కూడా మోడీ తెలిపారు. అయితే ఆ సమయంలో తాను కేసీఆర్‌కు ఒక విషయాన్ని స్పష్టం చేశానన్నారు. ఇది రాజరికం కాదని తేల్చి చెప్పానన్నారు. ప్రజలు ఆశీర్వదించిన వారు మాత్రమే పాలకులవుతారని కూడా విస్పష్టంగా చెప్పానన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పీఠం కోసం మద్దతు ఇవ్వాలని అడిగారని… విపక్షంలో కూర్చుంటాం కానీ మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేసినట్లు మోడీ వివరించారు. తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయనని కేసీఆర్‌కు, తాను స్పష్టం చేసిన అని కూడా వివరించారు. కేసీఆర్ అడిగినప్పటికీ తాను ఎన్డీఏలో చేరేందుకు అంగీకరించలేదని మోదీ చేసిన వ్యాఖ్యలు కల్లోలం తెలంగాణలో ఇప్పుడు ఒక పెను సంచలనంగా మారాయి.