Home Page SliderTelangana

కేసీఆర్ సర్కారుపై నిప్పులు చెరిగిన ప్రధాని నరేంద్ర మోడీ

రాజకీయాలను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మార్చేస్తున్నారంటూ బీఆర్ఎస్ సర్కారుపై మండిపడ్డారు ప్రధాని నరేంద్ర మోడీ. చీఫ్ మేనేజర్, డైరెక్టర్, మేనేజర్ మరియు అన్ని పోస్టులను ఒకే కుటుంబ సభ్యులతో భర్తీ చేస్తున్నారన్నారు. కుటుంబం నడిపే పార్టీలు ప్రజా తంత్రాన్ని పరివార్‌తంత్రగా మార్చాయన్నారు. పార్టీ పదవుల్లో పై నుంచి కింది స్థాయి వరకు అన్ని స్థాయిల్లో కుటుంబ సభ్యులే ఉన్నారన్నారు. కేసీఆర్ సర్కారు రైతులను మభ్యపెడుతోందని ధ్వజమెత్తారు ప్రధాని మోడీ. రెండు కుటుంబ పార్టీల వల్ల తెలంగాణ అభివృద్ధి ఆగిపోయిందన్నారు. కుటుంబం కోసం, కుటుంబం ద్వారా కుటుంబం కోసం పనిచేస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీపై కేసీఆర్ విరుచుకుపడ్డారు. రాజకీయ పార్టీలను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మార్చారని ధ్వజమెత్తారు మోడీ. రైతు పథకాల పేరుతో కేసీఆర్ సర్కారు దోచుకుంటుందని మండిపడ్డారు. అవినీతి, కమీషన్ కోసమే పనిచేస్తున్నారన్నారు.

హామీ ఇస్తే వాటికి విలువ ఉండాలని, మోడీ హామీ ఇస్తే అమలు చేస్తారని ప్రజలకు విశ్వాసం ఉందన్నారు ప్రధాని. ప్రజలు సహకరిస్తే తెలంగాణ అభివృద్ధిలో వేగం పెంచుతామన్నారు మోడీ. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి మద్దతు ఇవ్వాలని మోదీ కోరారు. తాము పేదలకు ఉచితంగా గ్యాస్, ఇళ్లను ఇస్తున్నామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. విశ్వవిద్యాలయం ముందుగానే స్థాపించాల్సి ఉన్నా… తెలంగాణ ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన భూమిని ఇవ్వకుండా జాప్యం చేసిందన్నారు. ఆదివాసీల ప్రయోజనాలకు ఈ ప్రభుత్వానికి ప్రాధాన్యత లేదని తేలిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ కారు స్టీరింగ్ మరో పార్టీ చేతిలో ఉన్నాయన్నారు మోడీ