Home Page SliderInternational

ఓదార్పుకే ఓదార్పు… ఉక్రెయిన్ పర్యటనలో మోదీ మార్క్

సమస్య వచ్చినప్పుడు, సంక్షోభాలొచ్చినప్పుడు మాత్రమే ఆయా అంశాలపై చర్చ సాగుతుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత తొలిసారిగా ప్రధాని మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించారు. నరేంద్ర మోదీ ఈవాళ అధ్యక్షుడు వ్లాడిమర్ జెలెన్స్కీని కలిశారు. కైవ్‌లోని మార్టిరాలజిస్ట్ ఎక్స్‌పోజిషన్‌లో నేతలు ఒకరిని ఒకరు కౌగిలించుకొని కరచాలనం చేసుకున్నారు. రష్యా-ఉక్రెయిన్ వివాదానికి చర్చల ద్వారా పరిష్కారం కనక్కోవాలని మోదీ అంతర్జాతీయ వేదికలపై కుండబద్ధలుకొడుతున్నారు. ఇవాళ ఇరువురు నేతలు ఒకరితో ఒకరు ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతున్నారు.

ప్రధాని మోదీ 10 గంటల పాటు ‘రైల్ ఫోర్స్ వన్’ ద్వారా పోలాండ్ నుండి కీవ్ చేరుకున్నారు. ఆరు వారాల క్రితం మోదీ రష్యా పర్యటనతో దుమారం రేగగా, నేడు ఉక్రెయిన్ పర్యటన ప్రపంచ వ్యాప్తంగా అటెన్షన్‌కు కారణమైంది. ఈ సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో వివాదాన్ని ముగించడంపై దృష్టి సారించి విస్తృత చర్చలు జరిపారు. జూన్‌లో ఇటలీలోని అపులియాలో జరిగిన జి7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ చివరిసారిగా జెలెన్స్కీని కలిశారు. ఈ సమావేశంలో, ఉక్రెయిన్ సంఘర్షణకు శాంతియుత పరిష్కారానికి మద్దతు ఇవ్వడానికి భారతదేశం శక్తి మేరకు కొనసాగిస్తుందని, చర్చలు, దౌత్య మర్గాల ద్వారా శాంతి సాధ్యమని మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడికి తెవిపారు.