నేడు కేరళలో ప్రధాని మోదీ పర్యటన
ఇటీవల కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో మోదీ నేడు కేరళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆయన ఈ రోజు కేరళలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ప్రధాని రెండు రోజుల పాటు కేరళలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఈ రోజు సాయంత్రానికి ఆయన కేరళ చేరుకోనున్నారు. సెప్టంబరు 2 న ఆయన కేరళలలో దేశంలో స్వదేశీయంగా నిర్మించిన మొదటి విమాన వాహన నౌక-INS ను ప్రారంభించనున్నారు. అనంతరం ఆయన అక్కడ జరిగే పలు అభివృద్ది కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ప్రధాని మోదీ పర్యటన కోసం కేరళ పోలీసులు,భద్రతా సిబ్బంది ఆయనకు కట్టుదిట్టమైన రక్షణను ఏర్పాటు చేశారు.