Home Page SliderNational

భారీవర్షాలపై ప్రధాని మోదీ సమీక్ష

దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని హిమాచల్‌ప్రదేశ్,ఉత్తరాఖండ్ రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తాయి. దీంతో యమునా,బియాస్ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ వరద ఉధృతితో ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న ఈ భారీ వర్షాలపై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. దీనిపై ప్రధాని మంత్రులు,అధికారులతోపాటు ఎన్డీఆర్ఎఫ్,ఆర్మీ అధికారులతో మాట్లాడారని పీఎంఓ ట్వీట్ చేసింది. కాగా ప్రభావిత రాష్ట్రాల్లో స్థానిక యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలు వేగవంతం చేయాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించినట్లు వెల్లడించింది.