సిడ్నీ బీచ్ కాల్పులపై ప్రధాని మోదీ స్పందన
ఆస్ట్రేలియాలోని సిడ్నీ బీచ్‌లో జరిగిన కాల్పుల ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్న ఆయన, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
ఉగ్రవాదాన్ని భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని ప్రధాని మరోసారి స్పష్టం చేశారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. ఈ కాల్పుల ఘటనలో ఇప్పటివరకు 12 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనలో ఒక దుండగుడు హతమవ్వగా, పోలీసులు పట్టుకున్న వ్యక్తిని నవీద్ అక్రమ్‌గా గుర్తించినట్లు సమాచారం.

