Home Page SliderNational

ప్రధాని నరేంద్ర మోదీకి మాతృ వియోగం

ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ కన్నుమూశారు. రెండు రోజులగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ అహ్మదాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందారు. చికిత్స పొందుతున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ తల్లిని పరామర్శించారు. హీరాబెన్ ఇటీవల వందేళ్ళ పుట్టినరోజు జరుపుకున్నారు. వయసు పైబడిపోవడం దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీకి తల్లిపై విశేషమైన ప్రేమాభిమానాలను చాన్నాళ్ల నుంచి చూస్తూనే ఉన్నాం. పుట్టినరోజుకు తల్లి దగ్గర నుంచి ఆశీర్వచనం తీసుకుంటూ ఆయన ముందుకు సాగుతూ వస్తున్నారు. ఆయన జీవితంలో తల్లి కీలక పాత్ర పోషించారనడంలో ఎలాంటి సందేహం లేదు. తన మాతృమూర్తి వందేళ్ల జీవితంలో చిరస్మరణీయమైన, విలువలతో కూడిన జీవితాన్ని గడిపారని ప్రధాని మోదీ ట్విట్టర్లో అభిప్రాయపడ్డారు.

publish-time  30-12-22 | 06:30 IST f