ప్రధాని మోదీ లయన్ సఫారీ…
మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్‌లోని గిర్ అడవులలో పర్యటిస్తున్నారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా అక్కడ లయన్ సఫారీని సందర్శించారు. అలాగే ఇక్కడ జునాగఢ్ జిల్లాలోని వన్యప్రాణుల అభయారణ్య ప్రధాన కేంద్రం సాసన్‌ను సందర్శించారు. ఈ రోజున నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్‌లైఫ్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. మోదీ జామ్‌నగర్ జిల్లాలోని అంబానీలు ఏర్పాటు చేసిన జంతు రక్షణ పునరావాస కేంద్రం వతారాను కూడా సందర్శించారు. ఆదివారం నాడు గుజరాత్‌లోని సోమనాథ దేవాలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

