లోక్‌సభలో ప్రధానిమోదీ కీలక వ్యాఖ్యలు
కొత్త పార్లమెంట్ భవనంలో కొత్త లోక్‌సభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం అద్భుతమైన ఘట్టం అని మోదీ అభివర్ణించారు. ఆయన మాట్లాడుతూ 50 ఏళ్ళ క్రితం దేశ చరిత్రలో ఎమర్జెన్సీ పరిస్థతిపై కీలకవ్యాఖ్యలు చేశారు. అప్పటి పొరపాటు పనులు మళ్లీ జరగకూడదని ఆకాంక్షించారు. మూడవసారి తమ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిందుకు, దేశానికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. సభ్యులందరినీ కలుపుకుని వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తాం అని ప్రకటించారు. దేశానికి మంచి బాధ్యతాయుతమైన విపక్షం కూడా అవసరం అని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి విపక్షాలు కూడా కలిసి, ప్రభుత్వానికి సహకరించాలని కోరుకుంటున్నట్లు హితవు పలికారు. ప్రజాస్వామ్య మర్యాదను కాపాడుదామని, సామాన్య పౌరుల ఆశలను నెరవేర్చాలని పేర్కొన్నారు.

