Home Page SliderNationalPoliticsTrending Today

ప్రధాని మోదీ చిన్ననాటి కథ-రూ.250తో ఎన్నికలలో విజయం

జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహిస్తున్న పాడ్‌కాస్ట్‌లో తన చిన్ననాటి ఒక విషయాన్ని పంచుకున్నారు ప్రధాని నరేంద్రమోదీ. రాజకీయాల్లోకి రావాలంటే భారీగా డబ్బు అవసరమా? అనే ప్రశ్నకు ఈ విషయాన్ని చెప్పారు మోదీ. “నా చిన్నప్పుడు ఊరిలో ఒక కంటి వైద్య నిపుణుడైన  డాక్టర్ పేషెంట్లను ప్రేమగా చూసుకునేవారు. ఆయన మంచి వక్త , ఒకసారి ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నారు. ఆయన వద్ద డబ్బు లేకపోవడంతో తనకు తెలిసిన వారందరి వద్ద కేవలం ఒక రూపాయి మాత్రమే తీసుకునేవారు. అలా వచ్చిన రూ.250 తో ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందారు. ఈ ప్రజాస్వామ్య సమాజంలో ఓటరు కూడా రాజకీయ నాయకుడే. ఓటు వేసేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఓట్ల కోసం ఏదైనా చేస్తామనే కాంట్రాక్టు విధానాన్ని వదులుకోవాలి”. అలాంటి వైఖరితో విజయం సాధించలేరని వ్యాఖ్యానించారు.