బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి ప్రధాని మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు
బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ ఈరోజు 95వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ఆయన ఇంటికి వచ్చారు. ప్రధాని మోదీ వెంట రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఉన్నారు. సమావేశానికి సంబంధించిన కొన్ని ఫోటోలను ట్విటర్‌లో పంచుకున్నారు మోదీ. భారత వృద్ధికి అద్వానీ అందించిన సహకారం చిరస్మరణీయమైనదని అన్నారు. అద్వానీ కుమార్తె ప్రతిభా అద్వానీతో కలిసి లాన్‌లోకి వెళ్లిన ప్రధాని మోదీ కన్పించారు. ఆయనకు బొకే ఇచ్చి, కబుర్లు చెప్పడానికి కూర్చున్నారు. ఒకరి పక్కన కూర్చొని నవ్వుతూ మాట్లాడుకున్నారు.
దేశానికి, బీజేపీకి అంకితమైన మీ జీవితం మాకు స్ఫూర్తిదాయకమంటూ పార్టీ చీఫ్ జేపీ నడ్డా హిందీలో శుభాకాంక్షలు తెలిపారు. అద్వానీ తన జీవితం మొత్తం… పార్టీ బలోపేతం చేశారని, ప్రభుత్వంలో భాగంగా దేశాభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు హోంమంత్రి అమిత్ షా. అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో డిప్యూటీ ప్రధానిగా పనిచేసిన అద్వానీ, గత మూడు దశాబ్దాలుగా బిజెపి ఎదుగుదల వెనుక ప్రధాన శక్తిగా గుర్తింపుపొందారు. లోక్‌సభలో రెండు సీట్లతో ఉన్న పార్టీ నుండి 1990ల చివరలో… కూటమి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం వరకు ఎంతో ఓర్పు, నేర్పు ప్రదర్శించారు. 2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలో సొంత మెజారిటీ వచ్చే వరకు పార్టీకి రక్షగా నిలిచారు.
1980లో అయోధ్యలో రామమందిరం కోసం డిమాండ్‌ను సమర్థించారు. ‘రథయాత్ర’ హిందూత్వ రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా నాడు అద్వానీ ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. న్యాయవాదిగా అద్వానీ గుర్తింపు పొందారు. RSSలో జీవితకాల కార్యకర్తగా ఉన్నారు. అయినప్పటికీ చాలా మంది RSS కార్యకర్తలలా… అవివాహితుడిగా ఉండలేదు. 2016లో మరణించిన భార్యతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు.

అద్వానీ 8, 1927 న కరాచీలో వ్యాపారవేత్తల సింధీ కుటుంబంలో జన్మించారు. 1947లో విభజన తర్వాత కుటుంబం బొంబాయి.. . ప్రస్తుతం ముంబైకి వలస వచ్చారు. రాజస్థాన్‌లో RSS కోసం పనిచేశారు. గుజరాత్, ఢిల్లీ ఎన్నికలలో కూడా గెలిచారు. 1998 నుంచి 2004 వరకు బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వంలో హోంశాఖ మంత్రిగా పనిచేశారు. 2002 నుంచి 2004 వరకు ఉప ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు. 2015లో భారతదేశం రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌ను అందుకున్నారు.