InternationalNews

విశ్వ వినువీధిలో భారత్ జయపతాక

యుక్తికి శక్తికి మారు పేరు ఇండియా. ప్రపంచాన్ని శాశించిన జగజ్జేట్టి భారతదేశం. స్వాతంత్ర్యం సాధించి 75 ఏళ్లయినా… జరగాల్సిన అభివృద్ధి లోపం నేటికీ ఇండియాకు
శాపంలా మారింది. ఒక అడుగు ముందుకు వేస్తే… మరో రెండడుగులు వెనక్కి అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయ్. 1991లో ఆర్థిక సంస్కరణలో దేశాన్ని కొత్త పుంతలు
తొక్కించామని ఏలికలు చెప్పుకున్నా.. ఆ తర్వాత దేశాన్ని పరుగులు పెట్టించింది మాత్రం ఎన్డీఏ సర్కారు. 1998లో వాజ్ పేయి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత దేశానికి కొత్త ఊపు వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశం అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. సంక్షేమం ముసుగులో సాగుతున్న అరాజకీయాన్ని ప్రశ్నించిన కమలనాథులు… అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి సంక్షేమం… అభివృద్ధి రెండు కళ్లులా పనిచేయడం ప్రారంభించారు. అప్పటి వరకు దేశంలో ఉన్న రోడ్ల రూపురేఖల్ని మార్చేశారు. దేశం నలములూలలకు వేగంగా చేరుకునేందుకు గోల్డెన్ క్వాడ్రిలేటరల్ పేరుతో నాలుగు లైన్లతో జాతీయ రహదారులతో కొత్త ఒరవడిని సృష్టించారు. ఇండియాను ప్రపంచంలో సూపర్ పవర్‌గా నిలబెట్టేందుకు నాడు అటల్జీ మొక్కలు నాటితే నేడు… అవి వృక్షాలుగా మారాయ్. ప్రస్తుతం అదే పంథాలో గత ఎనిమిదేళ్ల మోడీ సర్కారు పాలన సాగిస్తోంది. ఆధునిక ఇండియాను ఆవిష్కరమవుతోంది. నాడు మొదలైన అభివృద్ధి ప్రవాహం ఇప్పుడు దేశాన్ని సరికొత్త గమ్యం వైపు తీసుకెళ్తోంది.

ప్రపంచానికి విజ్ఞానం, సంపదను అందించిన భారతదేశం ఇప్పుడు ఎన్నో సవాళ్లను… సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ప్రధానిగా నరేంద్ర మోడీ పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత
ఇండియాను… ప్రపంచం చూసే కోణంలో మార్పు మొదలయ్యింది. ఇండియా అంటే ఇప్పటి వరకు ఉన్న వర్షన్ ఒకటైతే… ఇకపై ఇంకోటన్నట్టు సిచ్యూవేషన్ చేంజ్ అయిపోయింది. తాజా పరిణామాలు చూస్తే ఎలాంటి పరిస్థితినైనా ఇండియా తట్టుకొని నిలబడగలదన్న సంకేతాలను మోడీ సర్కారు అందిస్తోంది. ప్రపంచాన్ని ఇండియా ఒక రోజు శాశించే స్థాయికి వస్తోందనడంలో తాజాగా పాలన సాగుతోంది. ప్రపంచానికి సంస్కృతి, సంప్రదాయాలను నేర్పించిన భారత్… సమర్థవంతమైన నాయకత్వంతో ముందడుగేస్తోంది. ప్రపంచదేశాలు ఇండియా వైపు చూసేలా నిర్ణయాలు తీసుకుంటూ నవ శకాన్ని ఆవిష్కరిస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా… అమెరికా తర్వాత వేనూళ్ల కీర్తించబడుతున్న ఇండియా… ఇప్పుడు అగ్రదేశంగా ఆవిర్భవించేలా ప్రయాణం సాగుతోంది. ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యదేశానికి ఉండాల్సిన అర్హతలన్నీ సాధించి… మైటీ ఇండియాగా రూపొంతరం చెందుతోంది.

తాజాగా ఉక్రెయిన్,రష్యా యుద్ధ సమయంలో ఇండియా వ్యవహరించిన తీరు నభూతో నభవిష్యతి… ఓవైపు రష్యాతో దశాబ్దాల తరబడి మైత్రి… మరోవైపు అమెరికాతో కొనసాగుతున్న
వాణిజ్య ఒప్పందాలు రెంటినీ బేరీజు వేసుకుంటూ ఎక్కడా తోట్రుపాటు లేకుండా దేశానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా నిర్ణయాలు తీసుకుంటోంది. ఎవరు ఏమైనా చెప్పొచ్చు…
ఏదైనా చేయొచ్చు… అందుకు నేపథ్యం కూడా ఎంతో ముఖ్యం. ఉక్రెయిన్ విషయంలో ఇండియా చేస్తోంది అదే.. ఇన్నాళ్లుగా రష్యా నుంచి ఆయుధాల కొనుగోలుతో పూర్తిగా
ఆధారపడ్డ ఇండియా… ఒక్కసారిగా రష్యాకు వ్యతిరేకంగా వ్యవహరించడం సాధ్యమా అంటే అది కాదనే చెప్పాలి. అసలు రష్యా కోణంలో సమస్యను పరిశీలించినప్పుడే వాస్తవాలు
తెలుస్తాయ్. అలాకాకుండా… ఒకవైపు చూస్తే సమస్య ఎలా అర్థమవుతుంది. రష్యా సహకారంతో దేశంలో ఎన్నో మిలటరీ విజయాలతోపాటు.. శాస్త్ర సాంకేతిక
రంగాల్లోనూ భారతదేశం విశేషమైన ప్రగతి సాధించింది. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యాను ఎన్నడూ సమర్థించలేదు. ఐతే… మొత్తం వ్యవహారంలో రెండు దేశాలు కలిసి
చర్చించుకోవాలని మాత్రం స్పష్టం చేసింది. యుద్ధం వల్ల జరిగే నష్టాన్ని ఏ పక్షమూ పూడ్చుకోలేని విధంగా ఉంటుందని కూడా తేల్చి చెప్పింది.

ఓవైపు రష్యాపై ఆంక్షల ఖడ్గం విసిరిన ప్రపంచదేశాలు… అదే సమయంలో ఆ దేశంలో చౌకగా లభించే చమురును మాత్రం ఎగబడి మరి కొనుగోలు చేయడాన్ని యూరప్ దేశాల…
బలహీనతను రుజువు చేశాయ్. అదే సమయంలో చమురు ఉత్పత్తులపై ఆధారపడ్డ భారత్… రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకోవద్దంటూ సన్నాయినొక్కులతో హితవు
పలుకడాన్ని గత మూడు నెలలుగా చూస్తూనే ఉన్నాం. వారు చేస్తే సంసారం… మనం చేస్తే వ్యభిచారమన్నట్టుగా యూరప్ దేశాలు వ్యవహరించిన తీరును ఇండియా నిర్వద్వంద్వంగా తోసిపుచ్చింది. చమురు దిగుమతుల విషయంలో ప్రపంచదేశాలు ఆడుతున్న నాటకాన్ని ఇండియా విదేశాంగ మంత్రి జైశంకర్ పూసగుచ్చినట్టుగా వివరించి చెప్పడంతో… యూరప్ దేశాల గుట్టురట్టయ్యింది. అసలు చమురు రాజకీయాలు చేస్తోందెవరో అర్థమయ్యేలా చెప్పడం ద్వారా… తాను ఏ తప్పు చేయడం లేదన్న సందేశాన్ని ప్రపంచదేశాలకు ఇచ్చింది ఇండియా. ఓవైపు నూటికి 90 శాతం చమురు ఉత్పత్తులపై ఆధారపడ్డ ఇండియా… మిగతా దేశాల మాదిరిగా ఎలా వ్యవహరించగలుగుతుంది. ఇప్పుడిప్పుడు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న సమయంలో… ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఎంతో ఆర్థిక నష్టానికి కారణమయ్యింది. రష్యా చౌకగా చమురును ఇండియాకు విక్రయిస్తుంటే… అందుకు ససేమిరా అనడం ద్వారా బలవంతుడు… బలహీనుడ్ని ఆడిస్తున్నట్టుగానే ఆట కన్పిస్తోంది.

అమెరికా ఆడమన్నట్టు ఆడటానికి ఇండియా పాకిస్తాన్ ఆర్మీ కాదన్న విషయం ప్రపంచానికి ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో తేటతెల్లమయ్యింది. రేపోరోజు చైనా… ఇండియాపై ఎటాక్ చేస్తే ఎవరు సపోర్ట్ చేస్తారంటూ అగ్రరాజ్యం పెద్దలు వార్నింగ్ ఇస్తే… మరి అమెరికా వచ్చి… ఇండియాకు సపోర్ట్‌గా పోరాడుతుందో లేదో కూడా చెప్పాల్సిన నైతికత అమెరికాపై ఉంది కదా… మరి ఆ విషయంలో సమాధానం చెప్పని అగ్రరాజ్యం… ఇండియ విషయంలో టేక్ ఫర్ గ్రాంటెడ్ గా ఎలా వ్యవహరిస్తుంది. అదే సమయంలో అమెరికాతో ఉన్న సుదీర్ఘ ఒప్పందాల దృష్ట్యా… అక్కడ నివశిస్తున్న ఇండియన్లకు ఎలాంటి కష్టం, నష్టం కలగకుండా ఇండియా ఎన్నో చర్యలను తీసుకొంది. నిత్యం వందలు, వేల కోట్ల రూపాయల రెమెటాన్సెస్ ఇండియాకు వస్తున్న సమయంలో… ఎక్కడ ఏ చిన్న అవాంతరం జరిగిన దాని వల్ల ఇండియన్లకు, అంతిమంగా దేశానికి ఆర్థిక సమస్యలు తప్పవని పాలకులకు చాలా బాగా తెలుసు. అందుకే కీలక విషయాల్లో… ఇండియా ఆచితూచి వ్యవహరిస్తోంది. అదే సమయంలో దేశ ప్రయోజనాల విషయంలో మాత్రం రాజీపడటం లేదు.