Home Page SliderNational

సోనియా గాంధీతో ముచ్చటించిన ప్రధాని మోదీ

ఇవాళ పార్లమెంటు వర్షకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ ప్రారంభోత్సవ సమావేశాల్లో ఆసక్తికకర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ..కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆప్యాయంగా పలకరిచారు. ఈ క్రమంలో ప్రధాని  మోదీ ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో  సోనియా గాంధీ దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోన్న మణిపూర్ అల్లర్లు, తాజా ఘటనపై చర్చించాలని మోదీకి విజ్ఞప్తి చేసినట్లు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌధురి తెలిపారు.