ఏపీలో ఎన్డీఏ గాలి వీస్తోందన్న ప్రధాని మోదీ
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ గాలి వీస్తోందన్న ప్రధాని నరేంద్రమోదీ. కూటమికి వస్తున్న ఆదరణతో ప్రత్యర్థులకు నిద్రపట్టట్లేదన్నారు. ప్రత్యర్థులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారన్నారు. రాజమండ్రి, అనకాపల్లిలో జరిగిన ఎన్డీయే భారీ ర్యాలీలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. వైసీపీకి సరైన ఆర్థిక విధానాలు లేవన్నారు ప్రధాని నరేంద్రమోదీ. మూడు రాజధానుల పేరుతో లూటీ చేశారన్నారు. ఖజనాను ఖాళీ చేశారన్నారు. ఆర్థిక క్రమశిక్షణ లోపించిందన్నారు. వైసీపీ సర్కారు మద్యపానానికి పరిష్కారం చూపుతుందని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లకే ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత శక్తివంతమైన మద్యం సిండికేట్‌గా అవతరించిందన్నారు. అభివృద్ధి, అభివృద్ధి, అభివృద్ధి అనే సానుకూల ఎజెండాతో మా కూటమి ప్రజల్లోకి వెళుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ గాలి వీస్తోందన్న ప్రధాని నరేంద్రమోదీ. కూటమికి వస్తున్న ఆదరణతో ప్రత్యర్థులకు నిద్రపట్టట్లేదన్నారు. ప్రత్యర్థులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారన్నారు. ఏపీలోనూ, ఢిల్లీలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. చంద్రబాబు హయాంలో ఏపీ అభివృద్ధిలో ముందందన్నారు. ఏపీలో యువత ఎక్కువ. టెక్నాలజీలో వారు ముందంటారన్నారు. ఏపీలో అభివృద్ధి సున్నా.. అవినీతి వంద శాతమంటూ జగన్ సర్కారుపై విరుచుకుపడ్డారు. జూన్ 4న ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.


