వరంగల్‌కు చేరుకున్న ప్రధాని మోదీ
ప్రధాని మోదీ ఇవాళ వరంగల్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ ప్రత్యేక విమానంలో సికింద్రాబాద్‌లోని హకీంపేటకు చేరుకున్నారు. కాగా అక్కడి నుంచి ప్రధాని మోదీ హెలికాఫ్టర్‌లో వరంగల్‌లోని మామూనూరు మినీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అయితే అక్కడి నుంచి ప్రధాని మేదీ భద్రకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం వరంగల్‌లోని కాకతీయ కాలేజ్ గ్రౌండ్‌కి చేరుకుంటారు. అయితే అక్కడ రూ.6,100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్రమంలో తెలంగాణా మంత్రి శ్రీనివాస్ యాదవ్ వరంగల్‌లో ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్నారు. తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వరంగల్‌లో మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.