కాంగ్రెస్ ఎంపీతో వేదికపై ప్రధాని మోదీ..
ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం కేరళలో పర్యటించిన సంగతి తెలిసిందే. అదానీ కంపెనీ నిర్మించిన విఘింజమ్ ఇంటర్నేషనల్ డిపీ వాటర్ మల్టీపర్పస్ సీపోర్టును ప్రధాని మోదీ ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమం కోసం తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కూడా హాజరయ్యారు. నరేంద్ర మోదీని గురువారం రాత్రి ఎయిర్ పోర్టులో వెళ్లి వ్యక్తిగతంగా స్వాగతం పలికారు శశిథరూర్ . ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇటీవల కాలంలో ఎంపీ శశిథరూర్ తమ పార్టీ అధినాయకత్వంపై విశ్వాసం చూపించడం లేదు, వారిపై బహిరంగంగానే విమర్శలు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రధాని మోదీ నిర్ణయాలపై, విదేశాంగ విధానంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య శశిధరూర్ మోదీతో ఫోటో దిగడం సంచలనమయ్యింది. ప్రధాని మోదీ కూడా ఈ సభలో మాట్లాడుతూ ఈ ఫోటోలు చూస్తే కొందరికి నిద్ర పట్టదంటూ వేళాకోళం చేశారు.