Home Page SliderTelangana

‘దోస్త్‌కు దోచి పెడుతున్న ప్రధాని మోదీ’-కేటీఆర్

తన దోస్త్ అదానీకి దేశంలోని సంపదను దోచి పెడుతున్నారని ప్రధాని మోదీపై మండిపడ్డారు తెలంగాణా మంత్రి కేటీఆర్. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న బిఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ, దేశాన్ని వ్యాపారులకు తాకట్టు పెడుతున్నారన్నారు. తన దోస్త్ అదానీకి ఆరు ఎయిర్ పోర్టులు కట్టబెట్టారన్నారు. రెండు కంటే ఏ సంస్థకు ఎయిర్ పోర్టులకు లైసెన్సులు ఇవ్వరాదని నిబంధన ఉన్నా, దానిని పట్టించుకోలేదన్నారు. దేశంలో సింగరేణి, కోల్ ఇండియా, జార్ఖండ్‌లోని బొగ్గుగనులు ఎన్నో ఉన్నాయని, దేశవ్యాప్తంగా 361బిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతోందని, రాబోయే వందేళ్లకు విద్యుత్ ఉత్పత్తికి  సరిపడే నిల్వలున్నాయన్నారు. కానీ మోదీ విదేశాలతో ఒప్పందాలు చేసుకుని బొగ్గును, విద్యుత్‌ను  పది రెట్లు ఎక్కువ ధరకు అదానీ ద్వారా కొనుగోలు చేస్తున్నారని, ఆ భారం ప్రజలపై వేస్తున్నారని విమర్శించారు. దీనిని ప్రతిపక్షాలే కాక, సొంత పార్టీ వ్యక్తి ఐన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం వ్యతిరేకించారని, తాము ఇలా కొంటే అప్పుల పాలవుతామని చెప్పారని కుండ బద్దలు కొట్టారన్నారు.. విదేశీ బొగ్గు వల్ల కరెంటు రేట్లు పెంచితే ఆ భారం వల్ల నష్టపోయేది ప్రజలేనన్నారు. తెలంగాణా ప్రజలు బీజేపీ విషయంలో ఆలోచించాలన్నారు.