ఏనుగుల్ని పెంచడం మన కర్తవ్యమన్న ప్రధాని మోడీ
దేశంలో ఏనుగులు వృద్ధి చెందడానికి అనుకూలమైన ఆవాసాలను ఏర్పాటు చేయడానికి నిబద్ధతతో ప్రత్నిస్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు. మన దేశ సంస్కృతి, చరిత్రలో ఏనుగులు భాగంగా ఉన్నాయన్నారు. ఇవాళ వరల్డ్ ఎలిఫెంట్ డే సందర్భంగా వాటి రక్షణకు కృషి చేస్తున్న సంస్థలు, వ్యక్తులను ఎక్స్‌లో అభినందించారు. కొన్నేళ్లుగా ఏనుగుల సంఖ్య పెరుగుతూ ఉండటం సంతోషించదగ్గ అంశమన్నారు. కాగా మన దేశంలో 30 వేలకు పైగానే ఏనుగుల జనాభా ఉన్నట్లు ఒక అంచనా వేయబడింది.