నవంబర్ 7న తెలంగాణలో ప్రచారానికి వస్తున్న ప్రధాని మోడీ..
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోడీ రానున్నారు. ఈ నెల 7, 11 తేదీల్లో బీజేపీ నిర్వహించే సభల్లో పాల్గొననున్నారు. హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో సభలు నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళిక రచిస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన తరువాత రాష్ట్రానికి ప్రధాని రావడం ఇదే తొలిసారి.