Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page sliderNews

శ్రీశైల మల్లన్న సేవలో ప్రధాని మోదీ..వెంట చంద్రబాబు, పవన్ కళ్యాణ్

శ్రీశైలం : ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ గురువారం శ్రీశైల పుణ్యక్షేత్రంలో కొలువైన ఆదిదేవుడు మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ప్రధాని మోదీ కర్నూలు నుండి ప్రత్యేక హెలికాఫ్టర్ లో సున్నిపెంట వద్దకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లతో కలిసి వచ్చారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో శ్రీశైల క్షేత్రానికి చేరుకున్నారు. ఈ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని ప్రధాని తొలిసారి సందర్శించారు. దీనితో ఆలయ విశిష్టతలను ఆలయ అధికారులు ఆయనకు వివరించారు. శక్తిపీఠంగా వెలసిన భ్రమరాంబికా అమ్మవారికి ఖడ్గమాల స్త్రోత్రంతో కుంకుమార్చన నిర్వహించారు. జ్యోతిర్లింగంగా వెలసిన మల్లికార్జున స్వామికి పంచామృతాలతో రుద్రాభిషేకం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాని మోదీ ఏ క్షేత్రాన్ని సందర్శించినా ఆ సంప్రదాయ దుస్తులు ధరిస్తారు. అలాగే శ్రీశైలంలో కూడా కాషాయ కండువా, పట్టు పంచె ధరించి పూజలలో పాల్గొన్నారు. ప్రధాని వెంట చంద్రబాబు, పవన్ కూడా ఈ పూజలలో పాల్గొన్నారు.
దర్శనానంతరం ప్రధాని శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ శివాజీ విగ్రహానికి నమస్కరించారు. శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరాలను పరిశీలించారు.