వయనాడ్ బాధితులను ఓదార్చిన ప్రధాని మోడీ
కేరళలోని వయనాడ్ బాధితులను ప్రధాని మోడీ పరామర్శించారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను పరిశీలించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో కలిసి సహాయక శిబిరాలను సందర్శించారు. రెస్క్యూ ఆపరేషన్, బాధితుల తరలింపు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్న ప్రధాని మోడీ. బాధితుల పరామర్శ పూర్తైన తరువాత అధికారులతో ప్రధాని సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాతే ప్రధాని వరద బాధితుల సంక్షేమానికి ఏదైనా క్యాష్ సహాయ సహకారాలను అందించే యోచన చేయనున్నారు.