Andhra PradeshHome Page Slider

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు జన్మదినం సందర్భంగా  ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని కోరుకుంటున్నాను. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

ముఖ్యమంత్రి జగన్‌కు పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో దివంగత ముఖ్యమంత్రి, సీఎం జగన్ తండ్రి  వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రపై యాత్ర అనే చిత్రం వచ్చింది. దీనికి సీక్వెల్‌గా యాత్ర2 అనే చిత్రాన్ని దర్శకుడు మహి వి. రాఘవ్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో జగన్ పాత్ర కూడా ఉంది. ఈ మూవీ రిలీజ్ తేదీని ఫిబ్రవరి 8గా ప్రకటించారు. జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ యాత్ర2 పోస్టర్‌ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. సినీనటి, మంత్రి రోజా సంక్షేమ సామ్రాట్ జగనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలని ట్విటర్‌లో పోస్టు చేశారు.