మెగా బ్రదర్స్‌తో సందడి చేసిన ప్రధాని మోదీ
ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఆయన మంత్రి వర్గమంతా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్టేజీపై ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధాని మోదీ స్టేజీపై ఉన్న అందరినీ పలకరించే సమయంలో పవన్ కళ్యాణ్ చెయ్యి పట్టుకుని చిరంజీవి వద్దకు తీసుకు వచ్చారు. అనంతరం వారిద్దరి చేతులను పైకెత్తి మోదీ అభివాదం చేయించారు. దీంతో స్టేజీపై ఓ అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. అనంతరం మోదీ చిరంజీవి,పవన్ కళ్యాణ్‌తో సరదాగా ముచ్చటించారు.