పులి పిల్లలతో ప్రధాని ఆటలు
గుజరాత్‌లోని జామ్ నగర్‌లో అనంత్ అంబానీ నిర్వహిస్తున్న వన్యప్రాణుల సంరక్షణా కేంద్రం వంతరాను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ పరిసరాలను దర్శించి, జంతువులను వీక్షించారు. అక్కడి వివిధ జాతులకు చెందిన సింహం పిల్లలు, పులి పిల్లలకు పాలు పట్టి, ఆటలాడి సరదాగా గడిపారు. సింహాలు, చిరుత పులులు, ఖడ్గమృగాలు, జిరాఫీలు, చింపాజీలు, పాములను చూశారు. అతి పెద్ద ఏనుగుల ఆసుపత్రిని కూడా దర్శించారు. వాటికి సేవ చేస్తున్న వైద్యులు, కార్మికులతో ప్రధాని సంభాషించారు. వంతారాలో 2వేల కంటే ఎక్కువ జాతుల జంతువులు, అంతరించిపోతున్న జాతులకు సంబంధించిన 1.5 లక్షలకు పైగా జంతువులు ఉన్నాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.