Home Page SliderTelangana

పరీక్ష పేపర్లు ఔట్‌పై ప్రధాని విమర్శలు

టీఎస్‌పీఎస్‌సి పరీక్షల పేపర్ లీకేజీపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. తెలంగాణ యువతను బీఆర్‌ఎస్ ప్రభుత్వం మోసగించింది. వారి బంగారు భవిష్యత్‌తో ఆటలాడుకుంటోంది. ఒక పరీక్షే కాదు అన్ని పరీక్షల్లోనూ తప్పుల తడకలు దొర్లాయి. నిరుద్యోగ భృతి ఇస్తామని మాట మార్చింది. ఇప్పటికీ తెలంగాణలో వేలాదిగా టీచర్ల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. వేల స్కూళ్లలో ఒకే ఒక్క టీచర్‌తో స్కూళ్లు నడుస్తున్నాయి. యువత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.