మారిషస్‌కి చేరుకున్న ప్రధాని
భారత ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ మారిషస్ పర్యటనకు వెళ్లారు.మంగళవారం ఉదయం పోర్ట్ లూయీస్ విమానాశ్రయంలో దిగారు.ఈ సందర్భంగా మారిషస్ ప్రధానమంత్రి రామ్ గూలమ్… తివిధ దళాధిపతులతో కలిసి మోదీకి ఘన స్వాగతం పలికారు. సరిహద్దు చొరబాట్ల నియంత్రణ,ఆర్ధిక పరిపుష్టి,వాణిజ్య ఒప్పందాలు, ఆయుధాల సరళీకృత సరఫరా తదితర అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.ఈ ఏడాది భారత్ బడ్జెట్‌లో మారిషస్ అభివృద్ధి కోసం రూ.5400కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే.

