Home Page SliderNational

బాలీవుడ్ బ్యూటీపై మండిపడ్డ పూజారులు..

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆమె వ్యాఖ్యలు ఆలయ పూజారులకు ఆగ్రహం తెప్పించాయి. ఉత్తర భారతదేశంలో తన పేరు మీద గుడి ఉందని, అదే విధంగా దక్షిణాదిలో కూడా అభిమానులు తనకు గుడి కట్టాలని కోరుకుంది. ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఊర్వశి ఈ వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఆమె వ్యాఖ్యలపై పూజారులు స్పందిస్తూ మండిపడ్డారు. ఊర్వశి రౌతేలా వ్యాఖ్యలు అందరినీ తప్పుదారి పట్టించేలా ఉన్నాయని పూజారి భువన్ చంద్ర ఉనియాల్ అన్నారు. బద్రీనాథ్ సమీపంలో బామ్నిలో ఊర్వశి పేరుతో ఆలయం ఉన్న మాట వాస్తవమేనని, కానీ ఆలయంతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇది మత విశ్వాసాలను అగౌరవపర్చడమేనని బ్రహ్మకపాల్ తీర్థ పురోహిత్ సొసైటీ అధ్యక్షుడు అమిత్ అన్నారు.