ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న ధరలు
దేశంలో ఇప్పటికే పెరిగిన వంటగ్యాస్,నిత్యావసరాల వస్తువుల ధరలతో దేశ ప్రజలు అల్లాడిపోతున్నారు. కాగా దేశంలో సామాన్యుడు బ్రతకడమే భారంగా మారిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రం మరోసారి కొన్ని ధరలు పెరగనున్నట్లు తెలిపింది. కాగా కేంద్రం ఇటీవల బడ్జెట్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ బడ్జెట్ ఆధారంగా ఏప్రిల్ 1 నుంచి పలు వస్తువుల ధరలు పెరగనున్నాయి. వీటిలో మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువులు,సిగరెట్లు,వెండి,ప్లాటినం,ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ,కార్ల విడిభాగాలు,మెడిసిన్ కవర్లు,గిల్ట్ నగలు,ఎలక్ట్రిక్ కిచెన్ చిమ్నీలు,ప్రైవేట్ జెట్లు,హెలికాప్టర్‌లు ఉన్నాయి. కాగా వచ్చే నెల నుంచి వీటి రేట్లు పెరగనున్నాయి.

