Home Page SliderNational

తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న కూరగాయల ధరలు

తెలంగాణా రాజధాని హైదరాబాద్‌లో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. కాగా మార్కెట్‌లో కేజీ టొమాటో ధర రూ.80కి చేరింది. మరోవైపు కిలో మిర్చి ధర రూ.120కి చేరి తినకుండానే ఘాటు పుట్టిస్తుంది. అయితే  ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తాజాగా రుతుపవనాలు ప్రవేశించి భారీగా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. దీంతో మార్కెట్‌లో కూరగాయల దిగుమతులు భారీగా పడిపోయి.. ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు ఏపీలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఏపీలోని విజయవాడలో కూరగాయల ధరలు కొండెక్కాయి. కాగా అక్కడ కిలో టొమాటో ధర రూ.50కి పైగా ఉంది. అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూరగాయల ధరలు కూడా పెరగడంతో సామాన్యుల పరిస్థితి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు తయారయ్యింది.