గత ప్రభుత్వాలు విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేశాయి..
గత బిఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేశారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బీజేపి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య తోపాటు ఆయన గురువారం ఉదయం పట్టణంలోని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వాకర్స్ ను కలుస్తూ.. పరిచయం చేసుకుంటూ ఎమ్మెల్సీ బిజెపి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. విద్య వ్యవస్థ బాగుంటేనే సమాజం బాగుంటుందన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కావాలంటే బిజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమురయ్య కి జిల్లా ఉపాధ్యాయులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. బీజేపి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

