విచారణకు వెళ్ళే ముందూ ప్రెస్ మీట్
ఓటు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినా బుకాయించే దొంగను కాదని,తాను నిఖార్సైన కేసిఆర్ సైనికుణ్ణని మాజీ మంత్రి కేటిఆర్ వ్యాఖ్యానించారు.ఏసిబి విచారణకు వెళ్లబోతూ ఆయన తన నివాసం వద్ద గురువారం మీడియాతో మాట్లాడారు. తాను ఏం చేసినా హైద్రాబాద్ కీర్తి ప్రతిష్టలు పెంచడానికే చేశానన్నారు.ఫార్ములా ఈ కారు రేసుతో హైద్రాబాద్ ఇమేజ్ అమాంతం పెరిగిందన్నారు.ఒక లొట్ట పీసు కేసు పెట్టి తనని వేధించాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.ఈ రేసులో అరపైసా అవినీతి కూడా జరగలేదన్నారు.తాను క్విడ్ ప్రోకో కి పాల్పడ్డానంటూ కాంగ్రెస్,బీజెపి చేస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రమూ వాస్తవం లేదన్నారు.తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందన్నారు.చివరకు సత్యమే గెలుస్తుందని కేటిఆర్ ధీమా వ్యక్తం చేశారు.