Home Page SliderTelangana

బీజేపీ రాష్ట్ర కార్యాలయం, నాంపల్లిలో ప్రెస్ మీట్

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యాలయం, నాంపల్లిలో ప్రెస్ మీట్.

ఈటల రాజేందర్ మాట్లాడుతూ: బీజేపీ ఓట్లు డబుల్ అయ్యాయి. ఒక సీటు నుండి 8 సీట్లు అయ్యాయి. భవిష్యత్తులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుంది.

మిగతా పార్టీలు డబ్బులు పంచినా, ప్రలోభాలకు గురిచేసినా కార్యకర్తల కృషివల్ల బిజెపికి ఇంత పెద్దఎత్తున ఓట్లు వచ్చాయి. కష్టపడిన ప్రతిఒక్కరికీ  ధన్యవాదములు.

ప్రజలు కూడా బిజెపిని ఆదరించినందుకు మా పక్షాన ధన్యవాదములు. 2018 ఎన్నికల్లో  6 శాతం ఓట్లు 1 సీటు రాగా, మూడు సీట్లలో రెండవ స్థానంలో బీజేపీ నిలిచింది. ఈ దఫా 8 సీట్లు గెలుచుకుంది. 19 నియోజకవర్గాల్లో రెండవ స్థానంలో ఉంది. 46 స్థానాల్లో డిపాజిట్ దక్కించుకుంది. 15 శాతంతో.. 36 లక్షల ఓట్లతో బీజేపీ మీద విశ్వాసం ఉంచారు. మోదీ గారు వాగ్ధాటితో గెలుస్తున్నారు అనే భావన శుద్ధతప్పు. భారతదేశ ప్రజలకు భద్రత, భరోసా ఇచ్చారు.

ప్రపంచ చిత్రపటం మీద భారతదేశ గొప్పతనాన్ని చాటారు. దేశం అంతా.. అన్ని భాషల, అన్ని ప్రాంతాల, అన్ని వర్గాల వారికి మా ప్రధాని అని చెప్పుకునేలా చేశారు. మోదీ హయాంలో  అజేయ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది.

2014లో  ఆర్థిక రంగంలో 11 స్థానంలో ఉంటే.. ఈ రోజు 5వ స్థానానికి ఎదిగింది. 3వ స్థానానికి ఎదిగేలా మోదీ గారు చర్యలు తీసుకుంటున్నారు. డబుల్ డిజిట్ ఉన్న ద్రవ్యోల్బణాన్ని సింగిల్ డిజిట్‌కి తగ్గించగలిగారు.

కరోనా సమయంలో ప్రజలకు ధైర్యం ఇచ్చిన వ్యక్తి మోదీ. దేశానికి ఉచితంగా వ్యాక్సిన్ అందించారు. నేపాల్, బంగ్లాదేశ్ ఆర్థికంగా చితికిపోతుంటే అండగా ఉన్న దేశం భారత్. ఖలిస్థాన్, కాశ్మీర్ ప్రత్యేక దేశాలు కావాలన్న స్థాయి నుండి.. పాకిస్థాన్‌లో ఉన్న బెలూచిస్తాన్, POK కూడా భారత దేశంలో కలుస్తామని చెప్తున్నారు. మోదీ విజన్ ఏంటో అర్థం చేసుకోవాలి.. మోదీ గారు వచ్చాక శ్రీనగర్‌లో బుల్లెట్ గాయాలు అయిన జవాన్ల సంఖ్య తగ్గింది అని ఆర్మీ డాక్టర్స్ చెప్తున్నారు. మన దేశం వైపు చూడాలంటేనే పక్క దేశాలు జంకుతున్నాయి.

రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, మిజోరం తెలంగాణలో ఎన్నికలు జరిగితే దిగ్విజయ్ సింగ్, కమల్‌నాథ్ లాంటి వాళ్ళు evm టాంపరింగ్ అని మాట్లాడడం వారి విజ్ఞతకే వదిలివేసున్నా.  2019 లో 303 సీట్లు గెలిచారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్ల గెలుపు దిశగా ప్రయాణిస్తున్నారు. ఏ దేశానికి మేము తక్కువ కాదు అని మోదీ నిరూపించారు.

రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో యుద్ధాన్ని ఆపి మన పిల్లలని సురక్షితంగా తీసుకొని వచ్చిన మహనీయుడు నరంద్రమోదీ. ఆఫ్రికన్ దేశాలకి అండగా నిలవాలని జి-20 సదస్సులో చెప్పారు. అయోధ్య విషయంలో ఎవరినీ నొప్పించకుండా న్యాయబద్ధంగా గుడి కట్టించి దేశ ప్రజలకు అంకితం చేయబోతున్నారు. చంద్రయాన్-3 విజయవంతం చేశారు. చిన్నవాళ్ళు కురచ వాళ్ళు మోదీ గురించి కామెంట్స్ చేస్తున్నారు.

పార్లమెంట్ ఎన్నికలు దేశ సమగ్రత, రక్షణ, పురోభివృద్ధి, పేదరిక నిర్మూలన కోసం బీజేపీకి ఓట్లు వేయడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు. అవినీతి కంపులేని పాలన అందిస్తున్న మోదీగారు  పార్లమెంట్ ఎన్నికల్లో స్వీప్ చేయబోతున్నారు.

***

రఘునందన్ రావు మాట్లాడుతూ: కడియం శ్రీహరి వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం. ఆయన మాటలకు బిజెపికి ఎలాంటి సంబంధం లేదు. కడియం కామెంట్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం. MIM తో అంటకాగే పార్టీతో మా పార్టీ ఉండదు.

సోషల్ మీడియాలో కార్యకర్తలు తప్పుడు పోస్టులు పెట్టవద్దు. సంయమనం పాటించండి. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఆ పోస్టింగ్స్‌పై సరైన నిర్ణయం తీసుకుంటారు.