Home Page SliderNational

పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగం..కాశ్మీర్ లోయ ప్రస్తావన

కొత్త లోక్‌సభ కొలువు తీరాక నేడు ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తున్నారు. వరుసగా మూడోసారి అధికారం చేపట్టిన ప్రధానిమోదీ ప్రభుత్వాన్ని అభినందించారు. కాశ్మీరులోయ ఉగ్రవాదులకు, శత్రువులకు గట్టి జవాబునిచ్చిందని పేర్కొన్నారు రాష్ట్రపతి. శత్రువుల కుట్రలకు కాశ్మీరు ప్రజలు ఓటులే జవాబునిచ్చారని, పెద్ద ఎత్తున ఓటింగులో పాల్గొన్నారని అభినందించారు. దేశప్రజల విశ్వాసం గెలుచుకున్న లోక్‌సభ సభ్యులు సభకు వచ్చారని, వారందరూ ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగం కావాలని కోరారు. ప్రపంచ వృద్ధిలో భారత్ 15 శాతం భాగస్వామ్యం అవుతోందన్నారు. అన్ని రంగాలలో అభివృద్ధి వేగంగా పెరుగుతోందని, గ్రీన్ ఎనర్జీ దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా కల సాకారమయ్యిందని, మహిళల ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయని పేర్కొన్నారు. తన ప్రసంగంలో ఆయుష్మాన్ భారత్, సైనికులకు ఒకే ర్యాంక్ ఒకే పింఛన్ అమలు వంటి విషయాలు ప్రస్తావించారు.