ప్రజ్ఞారెడ్డి లేఖకు స్పందించిన రాష్ట్రపతి
పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని జి. రాఘవరెడ్డి కోడలు ప్రజ్ఞారెడ్డి ఇటీవలే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈ మెయిల్ ద్వారా లేఖ పంపారు. తన మామ జి. రాఘవరెడ్డి, అత్త భారతి రెడ్డి, వారి కుమార్తె శ్రీదివ్య రెడ్డి తనను, తన కుమార్తెను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారంటూ ప్రజ్ఞారెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. వారి నుంచి తనను కాపాడాలంటూ ఆమె రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. అయితే.. ప్రజ్ఞారెడ్డి లేఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. ప్రజ్ఞారెడ్డి వ్యవహారంలో తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ సీఎస్‌ను ఆదేశించారు. జి. రాఘవ రెడ్డి కుమారుడు ఏక్‌నాథ్ రెడ్డితో ప్రజ్ఞారెడ్డి విహహం 2014లో జరిగింది. అయితే వీరి కాపురంలో మనస్పర్థలు రావడంతో ప్రజ్ఞారెడ్డి గతంలో పుల్లారెడ్డి కుటుంబ సభ్యులపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

