Home Page SliderInternational

రష్యాలో పర్యటించాలని ప్రధాని మోడీని కోరిన అధ్యక్షుడు పుతిన్

వచ్చే ఏడాది తమ దేశంలో పర్యటించాలని ప్రధాని మోడీని రష్యా అధ్యక్షుడు పుతిన్ కోరారు. మోడీ పర్యటన వల్ల ప్రస్తుత పరిస్థితులను సమీక్షించడంతో పాటు భవిష్యత్‌లో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించే అవకాశం ఉంటుందని పుతిన్ అభిప్రాయపడ్డారు. ఇరు దేశాలూ కలిసి చేయాల్సిన పని పెద్దమొత్తంలో ఉందని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోడీకి పుతిన్ బెస్ట్ విషెస్ చెప్పారు.