తాజ్ మహల్ లో మాల్దీవోస్ ప్రెసెడెంట్
మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు తన సతీమణితో కలిసి ఈ రోజు తాజ్ మహల్ ను సందర్శించారు. తాజ్ మహల్ ముందు ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు. ఆయన ప్రత్యేక విమానంలో ఆగ్రా చేరుకోగానే ఉత్తరప్రదేశ్ మంత్రి యోగేంద్ర ఉద్యాయ్ వారికి స్వాగతం పలికారు. కాగా ముయిజ్జు తాజ్ మహల్ సందర్శించే సమయంలో ప్రజలకు రెండు గంటలపాటు లోపలికి వెళ్లడానికి అనుమతి ఉండదని ఆగ్రా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇది వరకే ప్రకటించింది. దీంతో ప్రజలను సందర్శనకు అనుమతించడం లేదు. నాలుగు రోజుల ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం భారత్ కు వచ్చిన ముయిజ్జు నిన్న ప్రధాని మోదీతో భేటీ అయ్యారు.