హైద్రాబాద్ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము హైద్రాబాద్ పర్యటన ఖరారు అయ్యింది.ప్రతీ ఏటా శీతాకాలంలో దేశ రెండో రాజధానిగా భావించే హైద్రాబాద్ లో బారత రాష్ట్రపతి విడిది చేయడం ఎప్పటి నుంచో వస్తున్న పాలనా పరమైన ఆనవాయితీ .అందులో భాగంగా గురువారం రాత్రి ఆమె బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు.అక్కడ నుంచి రాష్ట్రపతి భవన్ కు చేరుకుని సేదతీరుతారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియం లో జరిగే భక్తి టివి కోటిదీపోత్సవంలో పాల్గొని తిరిగి రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటారు.రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు.అనంతరం శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీకి తిరుగుపయనమౌతారని అధికారులు వెల్లడించారు.

