Home Page SliderNational

రికార్డు సృష్టించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు ఓ రికార్డు సృష్టించారు. అదేంటంటే ఆమె ఈ రోజు సుఖోయ్  యుద్ధ విమానంలో విహరించారు.  దీని కోసం రాష్ట్రపతి ముర్ము ఈ ఉదయం తేజ్‌పూర్‌లోని భారత వాయుసేనకు చెందిన వ్యూహాత్మక వైమానిక స్థావరానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న అనంతరం ఆమె భద్రత దళాల నుంచి సైనిక వందనం అందుకున్నారు. తర్వాత ఫ్లయింగ్ సూట్ ధరించిన ముర్ము ఫైటర్ జెట్‌లో గగనయానం చేశారు. ఈ నేపథ్యంలో యుద్ధవిమానంలో విహరించిన రెండవ మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డు సృష్టించారు.