మహా కుంభమేళాలో రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహా కుంభమేళా వెళ్లారు. ఇవాళ ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమం లో ఆమె పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు త్రివేణి సంగమం ప్రాంతంలో రాష్ట్రపతి పడవలో పర్యటించారు. కుంభమేళాలో రాష్ట్రపతితో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

