Andhra PradeshHome Page Slider

ధాన్యం కొనుగోలుకు సన్నద్ధం కావాలి

అమలాపురం కలెక్టరేట్: ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేందుకు అధికారులు సన్నద్ధం కావాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశాలు జారీ చేశారు. బుధవారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 384 రైతు భరోసా కేంద్రాల పరిధిలో సుమారు 1.58 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి ఈ-పంటలో నమోదైందని, ఈ మేరకు అధికారులు కొనుగోలు ప్రక్రియకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. రైతుల వద్ద నుంచి ప్రతి గింజా మద్దతు ధరకు కొనుగోలు చేసేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. రైతులకు అవసరమైన గోనె సంచులను ముందుగానే వారికి అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మేనేజర్ సుధాసాగర్, డీఎస్ఓ పాపారావు, జిల్లా వ్యవసాయాధికారి బోసుబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.