గ్రాండ్‌గా ఐపీఎల్ 2026 మినీ వేలం సన్నాహాలు
ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబిలోని ఎతిహాద్ అరేనాలో గ్రాండ్‌గా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముందుగా ఈ వేలాన్ని ముంబైలో నిర్వహించాలని బీసీసీఐ భావించినా, తర్వాత ఏ కారణం చేతనో వేదికను మార్చి అబుదాబికి షిఫ్ట్ చేసింది. మరో 15 రోజుల్లో జరగబోతున్న ఈ ఈవెంట్‌కు సంబంధించి కీలక అప్డేట్ వెలువడింది. మొత్తం 77 స్థానాల కోసం 1355 మంది క్రికెటర్లు నమోదు చేసుకోవడంతో పోటీ తీవ్రంగా మారింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్లు కెమెరాన్ గ్రీన్, స్టీవ్ స్మిత్ వంటి పేర్లు కూడా ఉండటం ఆసక్తి కలిగిస్తోంది. అందులో 31 స్లాట్లు విదేశీ ఆటగాళ్లకే కేటాయించాల్సి ఉంటుంది. ఇక జట్ల విషయంలో కేకేఆర్ అత్యధికమైన ₹64.30 కోట్ల పర్స్ వాల్యూతో మొదటి స్థానంలో ఉండగా, మంచి ప్లేయర్లను దక్కించుకునే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 10 జట్లు కలిపి ఈ మినీ వేలంలో సుమారు ₹237.55 కోట్లు ఖర్చు చేసే అవకాశం

