ఒడిశా రైలు ప్రమాదంపై రైల్వేశాఖ ప్రాథమిక నివేదిక
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో నిన్న రాత్రి కోరమండల్ ఎక్స్‌ప్రెస్,హావ్‌డా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఓ గూడ్స్ రైలు ఢీకొన్నాయి. కాగా ఈ దుర్ఘటనలో 288 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 1000 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఈ ప్రమాదంపై రైల్వేశాఖ తాజాగా ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు మెయిన్‌లైన్ పైనే సిగ్నల్ ఉన్నట్లు వెల్లడించింది. లూప్‌లైన్‌లో ఆగిఉన్న గూడ్స్ రైలును కోరమండల్ ఢీకొట్టినట్లు రైల్వేశాఖ అధికారులు ప్రాథమిక నివేదికలో వెల్లడించారు. ఈ ప్రమాదంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ బోగీ ఒకటి నేలలో కూరుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రమాదస్థలంలో యుద్ధప్రాతిపదికన సహయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

