స్మార్ట్ ఫోన్ లైట్‌తో ముందస్తు వృద్ధాప్య ఛాయలు
స్మార్ట్ ఫోన్‌ల అతి వాడకం మంచిది కాదని ఇప్పటికే అనేక అధ్యయనాలలో తేలింది. రాత్రి పూట ఫోన్ లైట్ ఎక్కువ సేపు కళ్లలో పడితే కళ్లు ఒత్తిడికి గురి కావడం, నిద్రకు భంగం కలగడం వంటి పలు రకాల సమస్యలు ఏర్పడతాయి. దీనివల్ల తొందరగా వృద్థాప్య ఛాయలు వచ్చే అవకాశం ఉందని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫోన్ల నుండి వెలువడే నీలికాంతి వల్ల కొల్లాజెన్ ప్రొటీన్‌పై ప్రభావం చూపుతుందని, ఇది చర్మంపై ముడుతలకు కారణమవుతుందని మిషిగన్ స్టేట్ వర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. చర్మంపై ముడుతలు రాకుండా యువత కనీసం రాత్రి పూట కళ్లకు వీలైనంత విశ్రాంతి నివ్వడం మంచిదని హెచ్చరిస్తున్నారు.