Home Page SliderNational

RCB గెలవాలంటూ పూజలు

ఎప్పటికైనా RCB ఐపీఎల్ కప్పు కొడుతుందా అంటూ ఫ్యాన్స్ కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఈసారైనా కప్పు దక్కాలని పూజలు మొదలుపెట్టారు RCB ఫ్యాన్స్. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విరాట్ కోహ్లి ఫొటోలు, ట్రోఫీలు పెట్టి, పూజలు, హోమాలు చేస్తున్నారు. బంతికి బొట్టు పెట్టి హారతులిస్తూ కప్పు మనదేనంటూ మురిసిపోతున్నారు. ప్రతీ సీజన్‌లో పాపం బెంగళూరు ఫ్యాన్స్ సందడి చేయడం, కప్పు కోసం కలవరించిపోవడం మామూలే. ఇప్పటికైనా ఈ టీమ్ ప్లేఆఫ్‌కు చేరుకుని కప్ సాధిస్తుందేమో చూడాలి.